డాన్సులు, ఫైట్లతో ఆకట్టుకున్నప్రభుదేవా

0టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో తన టాలెంట్ రుజువు చేసుకున్న హీరో ప్రభుదేవా. నటుడిగానే కాక దర్శకుడిగా కూడా ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈయన గత కొంతకాలంగా బాలీవుడ్ బాట పట్టాడు. అక్కడ వరుసపెట్టి సినిమాలు తీసి.. తాజాగా మరోసారి కోలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే ‘అభినేత్రి’ సినిమాతో సక్సెస్ సాధించి అదే స్పీడుతో కళ్యాణ్ దర్శకత్వంలో ‘గుళేబాకావాలి’ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా నిన్న (శుక్రవారం) ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ బయటకు వదిలింది చిత్రయూనిట్. ఇందులో ప్రభుదేవా చేసిన డాన్సులు, ఫైట్లతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉండటంతో.. ఈ ట్రైలర్ యు ట్యూబ్‌లో ట్రేండింగ్‌గా మారింది. దేశంలోని పురాతన దేవాలయాల్లోని విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాను ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.