పార్లమెంటులోకి చొరబడ్డ తీవ్రవాదులు!

0Iran-Parliamentఇరాన్ పార్లమెంటులోకి ముగ్గురు ముష్కరులు చొరబడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సాయుధులైన తీవ్రవాదులు కొంతమందిని బంధించినట్లు సమాచారం. తీవ్రవాదుల దాడిలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు మరో ఇద్దరు సందర్శకులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

అయితే ఈ సంఘటనపై పలు రకాలుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. తెహ్రాన్ పార్లమెంటు కాంప్లెక్స్ లో ఒక్కడే తుపాకీతో ప్రవేశించాడని కొన్ని మీడియా సంస్థలు పేర్కొనగా.. ముగ్గరు సాయుధులు పార్లమెంటులోకి ఎంటరయ్యారని మరికొన్ని సంస్థలు చెప్పాయి. తీవ్రవాదులు ముగ్గురిని హతమార్చారని, ఇందులో భద్రతా సిబ్బందికి చెందిన ఒక ఆఫీసర్ ఉన్నారని ఐఎస్ఎన్ఏ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.

ఇదిలా ఉండగా దక్షిణా తెహ్రాన్ లో అయతల్లా ఖోమైనీకు చెందిన సాయుధుడైన ఒక తీవ్రవాది మౌసోలియం వద్ద కాల్పులు జరిపి పలువురిని గాయపరిచారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనేది ఇంకా తెలియరాలేదు.