గుంటూరోడు ఆడియో కొత్త విడుదల తేదీ

0Gunturodu-new-audio-releaseమనోజ్ తాజా చిత్రం గుంటూరోడు ఆడియోని జనవరి 26 న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.కానీ ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.ఈ పరిస్థితుల్లో ఆడియో విడుదల చేయడం సరికాదని గుంటూరోడు చిత్ర టీమ్ ఆడియో విడదల వాయిదా వేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 29 న హైదరాబాద్ లో జరపడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.టాలీవుడ్ నటులు సాయిధరమ్ తేజ్, శర్వానంద్, నాని మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆడియో వేడుకకు హాజరవుతారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న సత్య కు ఇదే మొదటి చిత్రం. క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.