గురు చిత్రం సెన్సార్ రివ్యూ

0Guru-cinema-posterసాలా ఖదూస్ అనే తమిళ , హిందీ సినిమాని వెంకటేష్ గురూ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డైలాగుల దగ్గర నుంచీ వెంకటేశ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించడం హీరోయిన్ కి కోచ్ గా చుక్కలు చూపించడం ఇవన్నీ బాగా కుదిరాయి.

ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ అనగానే ఫామిలీ ఆడియన్స్ తెగ చూస్తారు. నాగార్జున తో పాటు ఫామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది వెంకటేష్ ఒక్కడే. అయితే వెంకటేష్ సినిమా గురు లో సూపర్ యాక్షన్ సీన్ లు ఉన్నాయి అనీ హీరోయిన్ – హీరో ల మధ్య సంభాషణలు ఆదరగోట్టేలా వస్తాయి అని సెన్సార్ బోర్డు నుంచి మనకి అందుతున్న స్ట్రాంగ్ సమాచారం.

డైరెక్టర్ కొన్ని సీన్ లలో గత చిత్రం లో సీన్ లు ఫుల్లుగా వాడుకుని మరికొన్ని మాత్రం నేటివిటీ కి తగ్గట్టు రాసుకుంది. సుధ కొంగర తీసిన స్టైల్ లో వెంకటేష్ అద్భుతంగా కనిపించాడు అనీ అతని లుక్ కే బయట పాజిటివ్ టాక్ వినిపిస్తుంది అని అంటున్నారు. హీరోయిన్ ని ఇబ్బంది పెట్టె సన్నివేశాల దగ్గర నుంచీ, ఇంటర్వల్ బ్లాక్ – ఆఖర్లో క్లైమాక్స్ సన్నివేశాలలో అవుట్ పుట్ పెర్ఫెక్ట్ గా ఉంది అని అంటున్నారు.