సెట్స్ నుండి పారిపోయిన హీరో – హీరోయిన్

0

ఆన్ ది స్క్రీన్ హీరోలు వంద మంది రౌడీలు వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ అందరితో పోరాడుతూ ఉంటారు. కాని ఆఫ్ ది స్క్రీన్ మాత్రం హీరోలు రౌడీలు వచ్చినప్పుడు ఏం చేస్తారో అందరికి తెల్సిందే. వెండి తెరపై మాత్రమే హీరోయిజం చూపించే హీరోలు – బయట మాత్రం కనీసం పోరాట పటిమను కనబర్చరు. కొందరు హీరోలు మరీ పిరికి వారిలా ప్రవర్తిస్తారు. తాజాగా తమిళ హీరో జీవీ ప్రకాష్ పరిస్థితి ఇదే అయ్యింది.

తమిళనాడు చెన్నై లోని కన్నంగి నగర్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘జైల్’ చిత్ర యూనిట్ సభ్యులకు షాకింగ్ పరిణామం ఎదురైంది. కన్నంగి నగర్ ప్రాంతంకు అక్కడ రౌడీ ఏరియా అనే పేరు ఉంది. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అక్కడ హీరో జీవి ప్రకాష్ హీరోయిన్ అబర్నతి ‘జైల్’ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో కొందరు వేట కొడవల్లతో అటుగా దూసుకు వచ్చారట. దాంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా షాక్ అయ్యి పరుగు లంకించుకున్నారు.

హీరో హీరోయిన్ షూటింగ్ స్పాట్ నుండి కొంత దూరం పారిపోయి అక్కడ ఒక చిన్న ఇంట్లో చాలా సమయం తలదాచుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు రెండు గంటల పాటు హడావుడి కొనసాగిందట. రెండు వర్గాల మద్య పోరాటంతో అక్కడ వాతావరణం భయాందోళనకు కారణం అయ్యింది. చిత్ర యూనిట్ సభ్యులు అంతా మళ్లీ మెల్లగా చేరుకుని హీరోకు కాల్ చేయడంతో వచ్చినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి హీరో జీవీ ప్రకాష్ కు ఇది చేదు అనుభవం అని చెప్పుకోవాలి.
Please Read Disclaimer