ఉమెన్స్ డే పై వర్మ వివాదాస్పద ట్వీట్స్

0RGV-and-sunny-leoneసోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం సృష్టించడంలో ఎప్పుడూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుంటారు. మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని తాజాగా ట్విట్టర్‌లో వర్మ వివాదాస్పద కామెంట్లు చేశారు.

ప్రపంచంలోని మహిళలందరికీ నా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. శృంగార తార సన్నీలియోన్ ఏ విధంగా అందరికీ సంతోషాన్ని పంచుతున్నారో మీరు అలా ఆనందాన్ని పంచండి అని వర్మ ట్వీట్ చేశారు.

‘పురుషులకు మెన్స్ డే లేదు ఎందుకంటే అన్ని రోజులు మగవాళ్లవే. అందుకే ఒకరోజు ఆడవాళ్లకు కేటాయించారు’ అని వర్మ మరో ట్వీట్ చేశారు.

‘ఉమెన్స్ డేను తప్పకుండా మెన్స్ డే అని పిలువాలి. ఎందుకంటే మహిళల కంటే ఆ దినోత్సవాన్ని పురుషులే జరుపుకుంటారు కనుక’ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.

‘కనీసం పురుషుల దినోత్సవం రోజున గొడవ పెట్టుకోకుండా, అరవకుండా మగవాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి. మహిళల కోసం పురుషులు ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కానీ ఏదో ఒకరోజు మహిళా, పురుష దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.