హాట్ యాంకర్ ప్లేసులో ఐటెం బాంబ్

0Hamsa-Nandini-hot-picయంగ్ హీరో రాజ్ తరుణ్.. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది కూడా. కుక్కల కిడ్నాపర్ గా కామెడీ పండించబోతున్నాడు రాజ్ తరుణ్. ఈ మూవీకి అదనపు అట్రాక్షన్ గా ఓ ఐటెం సాంగ్ ను చేర్చాలని మేకర్స్ నిర్ణయించారు.

ఈ ఐటెంసాంగ్ లో నటించే భామ కోసం.. చాలామందినే జల్లెడ పట్టేశారు. చివరకు ఈ ఛాన్స్ ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చేతిలో పెట్టారనే టాక్ వినిపించింది. అయితే.. హఠాత్తుగా ఇప్పుడీ ఐటెం సాంగ్ లో హంసా నందిని నర్తించబోతోందని అంటున్నారు. టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ హంసానందిని ఐటెం సాంగ్ మాంచి అట్రాక్షన్ అవుతుంది కానీ.. రష్మీ గౌతమ్ ని తప్పించడం వెనక కారణాలు మాత్రం తెలియలేదు. బహుశా రెమ్యూనరేషన్ దగ్గర డీల్ సెట్ కాలేదని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

రాజ్ తరుణ్ పక్కన హంసానందిని అంటే చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఉంటుందిగా అనే కామెంట్స్ వినిపించాయ్ కానీ.. ఈ పాటలో కేవలం హంస ఒక్కతే ఉంటుందట. రాజ్ తరుణ్ ఈ పాటలో కనిపించడని తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించుకున్న ఈ ‘కిట్టుగాడు ఉన్న జాగ్రత్త’ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నారు.