ఐటెం సాంగ్ లో హాటీ హంస

0మొన్నటివరకు ఒక నటీమణి చేసిన రచ్చ మామూలుగా లేదు. రాక రాక ఒక మెగా అవకాశం.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సరసన స్వయంగా ఒక ఐటెం సాంగులో నర్తించే ఛాన్స్.. దానితో ఇక లక్ష్మీ రాయ్ చిటికెను వేలు కూడా సదరు షూటింగ్ స్పాట్ నుండి ట్వీట్లు చేయకుండా ఉండలేకపోయింది. రోజుకో ఫోటో షేర్ చేస్తూ.. రత్తాలు రత్తాలు సాంగు స్టిల్స్ తో ఊరించేసింది లక్ష్మీ రాయ్. ఆ తరువాత ఖైదీ నెం 150 రిలీజయ్యాక అమ్మడికి వచ్చిన క్రేజు అంతా ఇంతా కాదులే.

ఇప్పుడు అలాంటి క్రేజునే మూట కట్టుకోవాలని చూస్తోంది మరో హాటీ. ఆల్రెడీ చాలా స్టార్ సినిమాల్లో హీరోల ఇంట్రొడక్షన్ సాంగులో ఈమె లెగ్ పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే రేంజులో పేరు తెచ్చుకున్న ఆ బ్యూటి పేరు హంసా నందిని. అమ్మడు రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ”కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అమ్మడు కూడా షూటింగ్ మొదలెట్టిందో లేదు.. ఇక ఆ పాట తాలూకు ఫోటోలను జనాలతో పంచుకోవడం మొదలెట్టేసింది. తెగ గ్లామర్ చిందిస్తోందని ఆ ఫోటోలను చూస్తే అర్ధమైపోతోంది.

సినిమాల్లో ఛాన్సులే ఫేడైపోయాయ్ అన్న వేళ.. అటు లక్ష్మీ రాయ్ కు ఇటు హంసా నందినికి ఈ పాటలు కెరియర్ ను కొత్త మలుపు తిప్పుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.Hamsa Nanidini Item Song in Kittu