హన్సిక ఆ భారీ ప్రాజెక్టులో చేయడంలేదట!

0hansika-motwani-hotదర్శకుడు సుందర్.సి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన ‘సంఘమిత్ర’ చిత్రానికి ఎవరు ఊహించని అడ్డంకి వచ్చి పడిన సంగతి తెలిసిందే. ముందు నుండి అనుకున్నట్టు ఈ సినిమాలో శృతి హాసన్ నటించడలేదని కొన్ని నెలల క్రితమే తేలిపోయింది. అప్పటి నుండి ఆమె స్థానంలో ఎవరెవరో హీరోయిన్ల పేర్లు వినబడ్డా హన్సిక పేరు మాత్రం బలంగా వినబడింది. దీంతో అంతా ఆమె కన్ఫర్మ్ అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో నటించడంలేదని ఖచ్చితంగా తేలిపోయింది. హన్సిక సన్నిహిత వర్గాలు, సంఘమిత్ర ప్రాజెక్ట్ కు సంబందించిన వ్యక్తుల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. దీంతో బాహుబలికి సమానమైన ప్రాజెక్ట్ అని ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఎవరు చేస్తారనేదానిపై సస్పెన్స్ ఇంకా అలానే ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ జరుపుకున్న ఈ చిత్రాల్లో జయం రవి, ఆర్యలు పలు కీలక పాత్రలు చేస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.