సరదా తీర్చుకున్న బబ్లీ బ్యుటీ

0Hansikaహన్సిక తన సరదా తీర్చేసుకుంది. ఎప్పటి నుంచో ఈ అందాల భామకి బైక్‌ నడపాలని చాలా కోరికగా వుండేది. అయితే, ఓ పక్క షూటింగులు, మరోపక్క జనం ఎక్కడ గుర్తుపట్టి హంగామా చేస్తారోనన్న భయంతో ఇప్పటి వరకు ఆ కోరికను తనలోనే దాచేసుకుంది. అయితే, తాజాగా ఆ సరదాను ఒక్కసారిగా తీర్చేసుకుంది. చెన్నయ్ లో షూటింగులో వున్న ఈ అమ్మడికి అక్కడ బైక్‌ కనిపించగానే ఓ పట్టు పట్టాలనిపించిందట. వెంటనే అక్కడున్న యూనిట్‌ వాళ్ల సహాయంతో బాగా ప్రాక్టీస్‌ చేసింది. అంతేకాదు, అదే బైక్‌ మీద హోటల్‌ వరకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తనే చెబుతూ..’తొలిసారిగా బైక్‌ నడిపాను. షూటింగు లొకేషన్‌ నుంచి సరాసరి హోటల్‌కి కూడా దాని మీదే వచ్చేశాను కూడా. ఫుల్‌ ఎంజారుమెంట్‌’ అంటూ ట్విటర్లో పోస్ట్‌ ఒకటి వదిలింది.