క్రికెటర్ డేట్ చేస్తోంది ఈ బ్యూటీనా??

0హీరోయిన్స్ క్రికెటర్స్ పరిచయాలు ఎలా స్టార్ట్ అవుతాయో గాని వార్తల్లో మాత్రం తరచు వస్తుంటారు. క్రికెట్ కు బాలీవుడ్ తో సంబంధం దగ్గరగానే ఉంది. గత కొన్నేళ్లుగా పరిచయాలు స్నేహం నుంచి డేటింగ్ ల వరకు వెళుతుంది. అప్పుడపుడు విరుష్క జోడీల్లా పెళ్లి పీటలు కూడా ఎక్కవచ్చు. ఎప్పుడు ఎలాంటి వార్తలతో దర్శనం ఇస్తారో ఎవ్వరికి తెలియదు. వారిని అభిమానించే వారికి మాత్రం ఊహించని విధంగా షాక్ ఇవ్వడం సెలబ్రెటీలకు అలవాటే.

ఇకపోతే ఇండియన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గత కొంత కాలంగా తన ఆటతో కన్నా ఎఫైర్స్ కు సంబందించిన వార్తలతోనే ఎక్కువగా దర్శనమిస్తున్నాడు. మొదట్లో మనోడు ఎల్లి అవ్రామ్ తో తరచు కనిపించిన సంగతి తెలిసిందే. పార్టీలకు మీటింగ్ లకు అంటూ ఈ జోడి చాలా సార్లు కెమెరా కంట పడింది. ఇక ఊర్వశి రౌటేలా తో కూడా హార్దిక్ ప్రేమను నడిపినట్లు టాక్ వచ్చింది. ఈ మ్యాటర్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఆ ఇద్దరు కాదని ఇప్పుడు మరొక ముద్దు గుమ్మతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హాట్ బ్యూటీ ఈషా గుప్తాతో ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకొని తరచు టచ్ లో ఉంటున్నాడట. అలాగే సీక్రెట్ గా నైట్ అవుట్ డిన్నర్స కి లాంగ్ రైడ్ లకు వెళుతున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్ గా ఒక ఇద్దరి అభిప్రాయాలూ కలిస్తే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే వారే వివరణ ఇవ్వాలి.