బుల్లితెర భామ హరితేజ పెళ్లి సీక్రెట్స్

0serial-actress-hari-tejaత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్-సమంత జంటగా నటించిన అ..ఆ.. మూవీలో.. హీరోయిన్ వెనక సినిమా అంతా ఉండే కేరక్టర్ లో.. మంగమ్మగా నటించి ఆకట్టుకుంది హరితేజ. అంతుకుముందు బుల్లితెర సీరియల్స్ ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పరిచయస్తురాలే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన చాలా సీక్రెట్స్ పంచుకుంది హరితేజ.

‘రెండేళ్ల ముందు ఓ సంబంధం వచ్చింది. అన్నీ ఓకే అనుకుంటున్న టైమ్ లో.. మా నాన్న.. దీపక్ ను అన్ని రకాల సర్టిఫికెట్స్ చూపించమని అడిగాడు. ఓ ఫ్రెండ్ గా భావించమని కూడా అన్నాడు. అయితే.. నా మీద అనుమానమా అంటూ వాళ్ల నాన్నకు చెప్పడం.. పెద్ద గొడవ జరగడం.. పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం జరిగిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత కలిసి పాత గొడవలు మర్చిపోదాం పెళ్లి చేసుకుందాం అన్నాడు. వేరే వేరే ఊళ్లలో ఉండే మనం పెళ్లి ఎలా అన్నాను. నా ప్రొఫెషన్ కు అడ్డురాకపోతే సరే అన్నాను’ అని చెప్పిన హరితేజ.. ఆ తర్వాత పెళ్లయిన నాలుగోరేజే ఏడవాల్సిన పరిస్థితి గురించి వివరించింది.

‘అప్పటికి మా పెళ్లయిన నాలుగో రోజు అది. సాయంత్రం తనతో కలిసి బయటకు వెళ్దాం అని రెడీ అయ్యా. ఆఫీస్ నుంచి రాగానే.. ఎంచక్కా ట్రాక్ సూట్ వేసుకుని జిమ్ కి వస్తావా అన్నాడు. రానంటే తను వెళ్లిపోయాడు. దాంతో ఏడుపు వచ్చేసింది. బాగా డిప్రెషన్ ఫీలయ్యి అమ్మకు చెప్పాను. ఆ తర్వాత తనకు ఫిట్నెస్ పై ఎంత ఇష్టమో తెలిసింది. ఆ తర్వాత ఆయన మారలేదు కానీ మెల్లగా నేనే జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేశా’ అని చెప్పింది హరితేజ.