హరీష్ శంకర్ భలే అడిగేశాడుగా

0ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ డైరెక్టర్ల హీరో. ఒకసారి కథ విని ఓకే చెప్పాక డైరెక్టర్ ఏం చెబితే ఆది చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఆ విషయం స్వయంగా మహేషే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మహేష్ లో డైరెక్టర్లను ఇంప్రెస్ చేసే ఓ గొప్ప క్వాలిటీ ఉందంటూ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్ కు మహేష్ తోపాటు హరీష్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా వేదికపై హరీష్ మాట్లాడుతూ మహేష్ గురించి ఏమనుకుంటున్నారో డైరెక్టర్ కొరటాల శివ రెండు బ్లాక్ బస్టర్లలో చెప్పేశాడు. నాకు ఆ అవకాశం రాలేదు కాబట్టి మాటల్లో చెబుతానంటూ మహేష్ లో తనకు బాగా నచ్చే క్వాలిటీ గురించి చెప్పుకొచ్చాడు. ‘‘పోకిరి.. బిజినెస్ మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ – టైమింగ్ కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అడ్డాల శ్రీకాంత్ స్టయిల్ కనిపిస్తుంది. దూకుడులో శ్రీను వైట్ల టైమింగ్ కనపడుతుంది. కొరటాల శివ సినిమాల్లో సటిల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఏ డైరెక్టర్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ స్టయిల్ ని మహేస్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఆయనను పాదరసం అనేయొచ్చు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంత చెప్పి ఫినిషింగ్ టచ్ గా ఏదో ఒకరోజు హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మహేష్ ను ఓ సినిమాలో చూడాలని అనుకుంటున్నానని ఓపెన్ గా అడిగేశాడు. దీనికి మహేష్ తనకు అలవాటయిన స్మయిల్ తో అలాగే కనిపించాడు. హరీష్ అడిగిందానికి ఓకే అంటాడా.. ఏమో వేచి చూడాలి మరి.