రెచ్చగొట్టే ఫోజులతో రియా చక్రవర్తి

0అందాల భామ రియా చక్రవర్తి టార్గెట్ ఇప్పుడు ఒకటే అనే విషయం స్పష్టమైపోతోంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఫోటోలను షేర్ చేయడం.. అందాలను ఆరబోయడం కుర్ర బ్యూటీలకు కొత్తేమీ కాదు కానీ.. రెండు రోజులకో ఫోటో చొప్పున రెచ్చిపోవడం మాత్రం అందరూ చేయరు. ఇలా చేయడం అంటే.. అందుకు ప్రత్యేకమైన కారణం ఉండాల్సిందే.

వరుసగా తన ఫాలోయర్స్ కు అందాల విందు చేస్తున్న తూనీగ తూనీగ హీరోయిన్.. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. దాదాపుగా టాప్ లెస్ గా కనిపిస్తూనే అందాలను కవర్ చేయడానికి మాత్రం ఓ డెనిమ్ టాప్ ను హుక్స్ కి జత చేసిందంతే. లోపల వేరే డ్రస్ వేసుకుని.. పైన ఇలా కవర్ చేసుకోవడం సహజమే కానీ.. అమ్మడి ఇంటెన్షన్ వేరు కదా. అందుకే ఏ యాంగిల్ లోంచి చూసినా.. మత్తెక్కించేలా అందాల విందు చేసేసింది. పైగా రెండు చేతులను తలపై పెట్టుకుని ఇచ్చిన పోజ్ కారణంగా.. రియాలోని అందాలు వరదలా బయటకు వచ్చేస్తున్నాయి.

‘హేయ్.. వాట్సప్.. నా మైండ్ లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయ్’ అంటూ అమ్మడు కామెంట్ పెట్టి.. ఇకపై క్యూట్ గా ఉండబోనంటూ మొన్నటి మాటే చెప్పింది. కానీ క్యూట్ గా ఉండను అంటే.. దానికి అర్ధం ఇలా ఉంటుందని ఈ తూనీగ చెబుతుంటేనే అర్ధమవుతోంది. ఏమైనా ఈ అందాల భామల మాటలకు.. అర్ధాలే వేరులే!Rhea Chakraborty Latest Photo