అనిల్ సుంకర మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారా?

0

ఒక సినిమా హిట్ అనిపించుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది ఏంటని ప్రశ్నిస్తే ఒకరు కథ అంటారు.. మరొకరు స్క్రీన్ ప్లే అంటారు.. మరొకరు స్టార్ కాంబినేషన్ అంటారు. కానీ అవన్నీ నిజాలే కానీ వాటన్నికంటే ముఖ్యమైనది ఏ కథకు.. ఏ హీరోకు ఎంత బడ్జెట్ పెట్టాలి అని నిర్మాత కరెక్ట్ గా జడ్జ్ చేయగలగడం. అందులోనే అసలు విజయం దాగుంది. చాలా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని మరీ కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకోవాదానికి అదే కారణం. అయినా మన నిర్మాతలు మాత్రం చాలాసార్లు హీరోల మార్కెట్ కంటే ఎక్కువగా బడ్జెట్ పెడుతూ రిస్క్ చేస్తుంటారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఇదే విషయంలో హాట్ టాపిక్ అయ్యాడు.

అనిల్ సుంకర తన 14 రీల్స్ బ్యానర్ లో గతంలో ఓవర్ బడ్జెట్ లో సినిమాలు తీసి ఎదురుదెబ్బలు తిన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన గోపిచంద్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు తిరు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ కావడంతో మొదటే రూ. 30 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకున్నారట. కానీ భారీ క్యాస్టింగ్ తో పాటుగా విదేశాలలో షెడ్యూల్స్ వేయడంతో ఖర్చు ఇప్పుడు ఎక్కువ అయిందట. ఫైనల్ గా బడ్జెట్ రూ. 40 కోట్ల వరకూ టచ్ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ కెరీర్ లో ఇంతవరకూ పట్టుమని పాతిక కోట్లు వసూలు చేసిన సినిమా కూడా లేదు. అలాంటిది 40 కోట్లు అంటే చాలా రిస్క్. పైగా ఈమధ్య గోపిచంద్ సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా నలభై కోట్లు వసూలు చేయగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నానిలాంటి ఫామ్ లో ఉన్న సక్సెస్ఫుల్ హీరోలకే 40 కోట్ల మార్క్ అందుకోవడం చాలా కష్టంగా ఉంది. మరి చాలారోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ ఈ టార్గెట్ రీచ్ అవగలడా.. నిర్మాతను సేవ్ చెయ్యగలడా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer