నిర్మాతకు ఐలవ్యూ చెప్పిన కుమారి

0Hebah-Patel-Says-I-Love-youతను ఎంతగానో ఆరాధించే పెద్ద హీరో గురించి ఒక హీరోయిన్ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లో ‘ఐ లవ్యూ’ చెబితే అది పెద్ద విషయం కాదు. కానీ ఒక హీరోయిన్.. తాను పని చేసిన నిర్మాతకు వేదిక మీది నుంచి సీరియస్ గా ఐలవ్యూ చెబితే మాత్రం అది హాట్ టాపిక్కే అవుతుంది. ‘మిస్టర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హెబ్బా పటేల్.. నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి ఐలవ్యూ చెప్పడం ఇలాగే చర్చనీయాంశం అవుతోంది. హెబ్బా చాలా సీరియస్ గా మాట్లాడుతూ.. మధ్యలో బుజ్జి ప్రస్తావన తెచ్చి ఐలవ్యూ అనేసింది. పక్కనే ఉన్న యాంకర్ ఓ హీరోయిన్ ఇలా నిర్మాతకు ఐలవ్యూ చెప్పడం ఇదే తొలిసారి అయ్యుంటుందేమో అనేసింది కూడా.

జస్ట్ బుజ్జికి ఐలవ్యూ చెప్పడంతో ఆపేయకుండా ఈ చిత్రానికి మరో నిర్మాత అయిన ఠాగూర్ మధు గురించి చిత్రంగా మాట్లాడింది హెబ్బా. ఠాగూర్ మధు మంచి నిర్మాతే అని.. కానీ ఆయనతో తనకు పెద్దగా టచ్ లేదని.. బుజ్జి మాత్రం తనకు బాగా క్లోజ్ అని.. ఆయన తనను చాలా బాగా చూసుకున్నాడని వ్యాఖ్యానించింది హెబ్బా. ఆమె ఐలవ్యూ చెప్పి తన గురించి చేసిన వ్యాఖ్యలతో బుజ్జికి ఏం ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో అర్థం కాలేదు. చాలా చిత్రంగా ఫేస్ పెట్టాడు బుజ్జి. చివర్లో యాంకర్ ‘ఐలవ్యూ’ అనే మాటను తెలుగులో చెప్పమంటే బుజ్జి వైపు చూస్తూ.. ‘నువ్వు నాకు చాలా ఇష్టం’ అని వ్యాఖ్యానించడం విశేషం. తన సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకల్లో హెబ్బా ఇలాంటి మాటలు.. చేష్టలతో అవతలి వాళ్లను ఇరుకున పెట్టడం ఇది తొలిసారి కాదు. ‘కుమారి 21 ఎఫ్’ దగ్గర్నుంచి ఆమె అంతే. ‘ఈడోరకం ఆడోరకం’.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో వేడుకల్లోనూ ఆమె ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశం అయింది.