హలో గురు ప్రేమ కోసమే సాంగ్స్మే రివ్యూ

0

ఇళయరాజా కంపోజింగ్ గురించి చెప్పడం అంటే సముద్రం నీటిని దోసిట్లో పట్టడం లాంటిది. 80-90 దశకాలను సంగీత చక్రవర్తిలా ఏలిన ఆయన ప్రభావం అప్పటి యూత్ మీదే కాదు ప్రతి తరం సంగీత ప్రియుల మీద పడుతూనే ఉంది. ఆయన రిటైర్ అయ్యే నాటికి పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఆయన పాటలను విపరీతంగా ఇష్టపడటం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే రామ్ కొత్త సినిమా హలో గురు ప్రేమ కోసమే టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అందరకి వద్దన్నా నిర్ణయం సినిమా ఠక్కున గుర్తొస్తోంది.

దానికి కారణం అమల వెంటపడుతూ తన గుణగణాలు వివరిస్తూ నాగ్ చేసిన అల్లరి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. అలాంటి పాటలో మొదటి లైన్ ను టైటిల్ గా పెట్టుకున్నారు కాబట్టి అంచనాలు రేగడం సహజం. అందులోనూ రాజా వీర భక్తుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనగానే దాన్ని మరిపించే ట్యూన్ తో ఓ రేంజ్ లో కంపోజ్ చేసుంటాడు అనే ఆశించారు అభిమానులు. కానీ జరిగింది వేరు.

ఎటువంటి హడావిడి లేకుండానే హలో గురు ప్రేమ కోసమే ఆల్బం నేరుగా మార్కెట్ లోకి వచ్చేసింది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేసాయి కాబట్టి సంగీత ప్రియులు చివర్లో ఉన్న టైటిల్ సాంగ్ కు వెళ్లిపోయారు. కానీ విచిత్రంగా చాలా రొటీన్ గా అనిపించే తన ట్రేడ్ మార్క్ తో బీట్ తో మాములు ట్యూన్ తో దేవిశ్రీ ప్రసాద్ నిరాశ పరిచాడనే చెప్పాలి. శ్రీమణి లిరిక్స్ సైతం సోసోగానే ఉన్నాయి. హలో గురు ప్రేమ కోసమే గుండెల్లో కట్టా ప్రేమ దేశమే అని హీరో అంటే దానికి బదులుగా హలో గురు ప్రేమ కోసమే చేయలేవు నన్ను మోసమే అంటూ ఫక్తు కమర్షియల్ సాంగ్ తరహాలో మిక్స్ చేయడం కాస్త నిరాశ పరిచేదే.

రీమిక్స్ చేయకపోవడం ఒకవిధంగా మెచ్చుకునే పనే అయినా ఇది ఇంకాస్త బెటర్ గా ఆశించడం ఫ్యాన్స్ తప్పు కాదు. రాజా బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయిన హలో గురు ప్రేమ కోసమే టైటిల్ ఇలా రొటీన్ సాంగ్ లా మారడం అంటే బాధేగా. అయినా దేవి ట్యూన్లు ఒకోసారి స్క్రీన్ మీద పాస్ అవుతుంటాయి.ఇదీ ఆ కోవలోకే వస్తుందేమో చూద్దాం.
Please Read Disclaimer