విప్పుకుంటే ఆఫర్లు వస్తాయా ? హేమ ఫైర్

0నటి శ్రీరెడ్డి పై మండి పడింది సినియర్ నటి హేమ. అసలు శ్రీరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని విమర్శించారు. ” నాకు సినిమాలంటే ప్రాణం. 300కు పైగా సినిమాల్లో నటించాను. విడుదలైన ప్రతి సినిమా చూస్తాను. కానీ శ్రీరెడ్డి ఆర్టిస్ట్ అని నాకు తెలీదు. మనం నటించే సినిమా హిట్‌ అయితే అవకాశాలు వస్తాయి.. పరాజయం అయితే అవకాశాలు రావు” అని చెప్పుకొచ్చింది.

పరిశ్రమంలో నేనూ ఎన్నో ఒడుదుకులు ఎదుర్కొన్నా. కానీ ఇలా ఎప్పుడూ బయటపడలేదు. సినిమా పరిశ్రమలో తెలుగు మహిళలకు అవకాశాలు రావడం లేదని శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇక్కడ ఎవరు ఎవరికీ లైఫ్ ఇవ్వరు. హిట్లు వుంటే సినిమాలు వస్తాయి. లేదంటే రావు. అంతే కానీ మాకు ఆఫర్లు కావాలని డిమాండ్ చేస్తే రావు. అన్నీ విప్పుకుంటే ఇక్కడ ఆఫర్లు వచ్చేస్తాయను కోవడం మూర్ఖత్వం” అని మండిపడింది హేమ.