బిగ్ బాస్ -2 టీమ్ వీళ్లే !

0పాపులర్ హిందీ షో బిగ్బాస్ దేశ వ్యాప్తంగా ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఇటీవలే ఎన్టీఆర్ సారథ్యంలో అది మొదటి సీజన్ విజయవంతంగా ముగియగా శివబాలాజీ విజేతగా నిలిచారు. దీంతో మరింత ఊపుతో బిగ్ బాస్ సీజన్ 2 మొదలుకానుంది. నాని సారథ్యంలో సాగే ఈ షోలో ఈసారి మునుపటి కన్నా ప్రముఖులు పాల్గొననున్నారు.

ఒకప్పుడు లవర్ బాయ్గా వరుస హిట్లు కొట్టిన తరుణ్ ఇందులోని ప్రముఖ కంటెస్టెంట్లలో ఒకరు. హస్కీ వాయిస్తో *మగాళ్లు ఒట్టి మాయగాళ్లు* వంటి సంచలన పాటలు పాడిన బ్యూటిఫుల్ సింగర్ గీతామాధురి కూడా దీనికి ఎంపికయ్యారు. హాట్ యాక్టర్ ఐస్ క్రీమ్ ఫేమ్ – యంగ్ లేడీ తేజస్విని మడివాడ మరో కంటెస్టెంట్ గా తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ గజాలా – శ్యామల – గత తరం హాట్ హీరోయిన్ రాశి లను షో కి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

చూస్తుంటే… పాపులర్ ముఖాలు ఉండటం వల్ల బిగ్ బాస్ 2 ఈసారి మొదట్నుంచే తెలుగు టీవీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించేలా అనిపిస్తోంది. వీరితో పాటు ఇంకొందరు కూడా ఎంపిక కానున్నారు. ఆ పేర్లు కూడా బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది అసలు క్రేజ్!