అండ్ ద సంక్రాంతి విన్నర్ ఈజ్..

0

మొత్తానికి సంక్రాంతి రేసులో ఉన్న నాలుగు సినిమాలూ రిలీజైపోయాయి. చివరగా శనివారం నాడు ‘ఎఫ్-2’ కూడా థియేటర్లలోకి దిగిపోయింది. ఏ సినిమా ఎలా ఉందనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. కంటెంట్ పరంగా చూస్తే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ అగ్ర భాగాన నిలుస్తుంది. తక్కువ లోపాలున్న.. ఉన్నంతలో నిలకడగా సాగిన సినిమా అదే అని చెప్పాలి. అలాగని దాన్ని సంక్రాంతి విన్నర్‌గా ప్రకటించేయొచ్చా అంటే ఆ సాహసం చేయలేం. ఎందుకంటే ఆ చిత్రానికి వసూళ్లు ఆశాజనకంగా లేవు. తొలి రోజే అన్ని చోట్లా ఆ చిత్రానికి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడలేదు. రెండో రోజు అయితే థియేటర్లు వెలవెలబోయాయి.

ఇక సంక్రాంతి రేసులో వచ్చిన రెండో సినిమా ‘పేట’కు ఓ మోస్తరు టాక్ వచ్చింది. రజనీ అభిమానుల్ని మాత్రమే ఈ చిత్రం అలరించేలా ఉంది. సరైన ప్రచారం లేకపోవడం, డబ్బింగ్ సినిమా కావడంతో దీనికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇక మూడో రోజు వచ్చిన ‘వినయ విధేయ రామ’ పరిస్థితి అయోమయంగా ఉంది. దీనికి అత్యంత బ్యాడ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో యునానమస్‌గా నెగెటివ్ టాక్ వచ్చింది ఈ చిత్రానికే. తొలి రోజు ఏకంగా రూ.26 కోట్ల షేర్ కూడా వచ్చింది. అలాగని సినిమా నిలబడి పోతుందనేమీ అనుకోవడానికి లేదు. రెండో రోజు వసూళ్లు పడ్డాయి. ఐతే షేర్ ఏ స్థాయిలో ఉంటుందని అంచనా వేయలేని పరిస్థితి నైట్ షోలు కూడా అయ్యాక సినిమా భవితవ్యంపై ఒక క్లారిటీకి రావచ్చు. ఐతే ఈ చిత్రం బయ్యర్లను బయటపడేసే అవకాశాలు మాత్రం లేవు. కంటెంట్ పరంగా సంక్రాంతి సినిమాల్లో ఇదే అట్టడుగున నిలుస్తుంది.

ఇక చివరగా వచ్చిన ‘ఎఫ్-2’ విషయానికి వస్తే ఫస్టాఫ్ వరకు బ్లాక్ బస్టర్‌ లాగా అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో సినిమా కింద పడింది. అయినప్పటికీ ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయగలే సత్తా ఉన్న సినిమా ఇదే. కంటెంట్ పరంగా ‘యన్.టి.ఆర్’ పైచేయి సాధించినప్పటికీ.. ఎక్కువ మంది జనాలకు చేరువ అయ్యే అవకాశమున్నది.. పెట్టుబడి మీద లాభాలు ఎక్కువ తెచ్చే ఛాన్స్ ఉన్నది దీనికే కాబట్టి ‘ఎఫ్-2’నే సంక్రాంతి విన్నర్‌గా ప్రకటించవచ్చేమో.
Please Read Disclaimer