బాలీవుడ్ లో కూడా విలనే

0jagapathibabuసెకెండ్ ఇన్నింగ్స్ లో తనకు సరిపడ పాత్రలను ఎంచుకొని, సెకండ్ ఇన్నింగ్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు జగపతిబాబు. ఈ వరుసలో బాలయ్య లెజెండ్ చిత్రంలో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. లెజెండ్ తో పాటు సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య’, సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నీవు లేని జీవితం’ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ ఇలావుంటే, తర్వరలో జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంభందించిన ఫోటో షూట్ కూడా జరిగింది. బాలీవుడ్ లో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో జగపతి ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఇందుకు సంభందించిన అధికారిక ప్రకటన రానుంది.