నా జీవితంలో డ్రగ్స్‌ చూడలేదు: హీరో నందు

0hero-nanduడ్రగ్స్‌ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. డ్రగ్స్‌ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు.

డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అన్నారు. టీవీల్లో నాపేరు చూసి షాక్‌ గురయ్యానని, డ్రగ్స్‌ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తెలిపారు. డ్రగ్స్‌ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.