19990 రూపాయలకే హీరో స్కూటీ!

0




hero scooty for Rs 20000ప్రముఖ టూవీలర్ సంస్థ హీరో గ్రూప్ నుంచి మరో అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇండియాలో వాహనదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, అతి తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలోకి రానుంది. హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 19,990 రూపాయలు. సుదూర ప్రాంతాలు వెళ్లాలంటే కష్టమే కానీ దగ్గరదగ్గర తిరగాలంటే ఈ స్కూటర్ ఉత్తమమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 48-వోల్ట్ 20ఏహెచ్ వీఆర్‌ఎల్ఏ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 65 కిలోమీటర్లు తిరగొచ్చట. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిలోమీటర్లు.  ఈ స్కూటర్ బరువు కేవలం 87 కిలోలు. మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. హీరో ఎలక్ట్రిక్ సీఈవో గ్లోబల్, సోహిందర్ జిల్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.