హీరోయిన్ తో దర్శకుడి నగ్నపూజలు

0poojaఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏమైనా చేసేస్తాయనేందుకు ఇదో ఉదాహరణ. జనాల్లో మూఢనమ్మకాలు ఇంకా అంతో ఇంతో ఉన్నాయనే మాట ఒప్పుకోవాల్సి వచ్చినా.. ఈ కాన్సెప్ట్ ను అడ్డం పెట్టుకుని ఫిలిం ఇండస్ట్రీపై దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చేందుకు ఛానల్స్ ఏ మాత్రం వెనకాడ్డం లేదు.

తాజాగా ఓ ఛానల్ లో ప్యానల్ డిస్కషన్ చేశారు. హిట్స్ కోసం కొందరు దర్శకులు.. నిర్మాతలు.. పలువురు హీరోయిన్లతో నగ్నపూజలు చేయిస్తున్నారని.. ఇలా చేయడం ద్వారా భారీ హిట్స్ కొట్టచ్చని భావిస్తున్నారన్నది ఈ డిస్కషన్ లో మెయిన్ ఎజెండా. ఇందులో ఎంత వాస్తవం ఉందనే సంగతి చెప్పేందుకు ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు కానీ.. ఓ జ్యోతిష్కుడు వెంటనే అందేసుకున్నాడు.

ఓ దర్శకుడు ఈ మధ్యనే ఇలాంటి నగ్నపూజా కార్యక్రమాన్ని ఓ పేరుమోసిన హీరోయిన్ తో చేయించాడని తనకు తెలిసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ పేరూ.. ఆ డైరెక్టర్ పేరూ వీళ్లు చెప్పరు.. ఎందుకంటే అందులో వాస్తవం ఏ మాత్రం నర్మగర్భంగా వీళ్లకూ తెలుసు. కానీ ఇలా చిలవలు పలువలు అల్లితేనే రేటింగ్స్ వస్తాయి కదా.

మరికొందరు ఔత్సాహికులు అయితే.. గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లతో ఇబ్బందులు పడుతున్న ఓ దర్శకుడి పేరును.. ఓ స్టార్ హీరోయిన్ పేరును ఊహించేసి లింకులు కలిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నగ్నపూజలు చేయిస్తే.. రికార్డులు దుమ్ము దులిపేయచ్చని టాలీవుడ్ నమ్ముతోంది అంటూ జనాలను నమ్మించే ప్రయత్నంగా కనిపిస్తోందంతే.