టెక్నిషియన్ గా మారుతానంటున్న కళ్యాణి ప్రియదర్శన్

0

ఫిలిం ఇండస్ట్రీలో ఒక డిపార్ట్ మెంట్ లో ఉండేవారు మరో డిపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ కావడం అక్కడ సక్సెస్ సాధించడం చాలా కామన్. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఉండేవారు నటులు అవుతారు.. హీరోలు అవుతారు. హీరోలు మెగా ఫోన్ పట్టుకుంటారు. రచయితలు కూడా దర్శకుల అవతారం ఎత్తడం కామనే. ఇక దర్శకులు.. హీరోలు.. నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తారు. తాజాగా ఇలాంటి జాబితాలోనే ‘చిత్రలహరి’ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ జాయిన్ కానుందట.

డైరెక్టర్ ప్రియదర్శన్.. సీనియర్ హీరోయిన్ లిజి ల ముద్దుల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ అఖిల్ అక్కినేని సినిమా ‘హలో’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్యే ‘చిత్ర లహరి’ సినిమాలో కన్ఫ్యూజింగ్ గా ఉండే అమ్మాయి పాత్రలో చక్కగా నటించి అందరినీ మెప్పించింది. చేతిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. శర్వానంద్- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కళ్యాణి ఒక హీరోయిన్. ఇవి కాకుండా రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతో ఫ్యూచర్ లో ఒక టెక్నిషియన్ గా మారాలని ఉందంటూ తన మనసులోని మాటను వెలిబుచ్చింది.

అయితే నాన్నగారు ప్రియదర్శన్ బాటలో దర్శకురాలిగా లక్కు టెస్ట్ చేసుకుంటుందా లేక ఆర్ట్ డైరెక్షన్ టేకప్ చేస్తుందా అనేది మాత్రం వెల్లడించలేదు. దర్శకత్వం సరే కానీ ఆర్ట్ డైరెక్షన్ మధ్యలో ఎక్కడినుంచి వచ్చిందని మీరు అనుమానపడకండి. ‘హలో’ లో హీరోయిన్ గా నటించడానికి ముందు హిందీలో హృతిక్ రోషన్ సినిమా ‘క్రిష్ 3’ కోసం సాబు సిరిల్ వద్ద ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గా పని చేసింది. సో.. కెమెరా వెనక్కు వెళ్ళడం ఖాయమే కానీ మెగా ఫోనా.. ఆర్టా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer