రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ లాల్, శ్రీదేవి..!

0Rajamouli-Speech-at-Trafficఓట‌మెరుగని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో త‌న కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను మ‌రింత‌గా పెంచుకున్నాడు. బాలీవుడ్ నిర్మాత‌లు కూడా ఈ ద‌ర్శ‌కుడి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆయ‌న క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. బాహుబ‌లి త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజ‌మౌళి త‌ర్వాతి ప్రాజెక్ట్ ని ఏ న‌టీనటుల‌తో , ఎలాంటి క‌థ‌తో చేయ‌నున్నాడ‌నే దానిపై భారీ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి త‌ర్వాతి చిత్రం మోహ‌న్ లాల్, శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై అఫీషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రావ‌ల‌సి ఉంది. ఇటీవ‌ల మామ్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకుంది శ్రీదేవి. ఇక మోహ‌న్ లాల్ వెలైపాడింతే పుస్త‌కం, ఒడియ‌న్, మ‌హా భార‌తం వంటి ప్రాజెక్ట్స్ లో న‌టించ‌నుండ‌గా ప్ర‌స్తుతం ఉన్ని కృష్ణ‌న్ తెర‌కెక్కిస్తున్న విల‌న్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.