అలాంటివి నాకు అలవాటు లేదు

0Samantha-New-Businessహీరోయిన్‌ సమంతకు పెళ్లి కల వచ్చేసింది. అక్టోబర్‌ ఆరో తేదీన సమంత- నాగచైతన్యల వివాహం జరగబోతుంది. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది క్రిష్టియన్‌ మత సంప్రదాయం ప్రకారం ఒకసారి, ప్రియుడి మతం హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి అంటూ రెండుసార్లు పెళ్లి, ముచ్చటగా మూడోసారి వివాహ రిసెప్షన్‌ అంటూ ముస్తాబవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే తన పెళ్లికి స్పెషల్‌ దుస్తులు సిద్ధం చేసుకున్న సమంత మరో పక్క చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

సమంత కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది-2 చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాక విజయ్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం మెర్శల్‌ తన పెళ్లి సమయంలోనే తెరపైకి రానుంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సమంత తానేమంత అందగత్తెను కాదని బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ బ్యూటీ సౌందర్య రహస్యం గురించి చెబుతూ.. నిజానికి తాను అందంగా ఉండాలని మాత్రమే కోరుకోనన్నారు. అందంతో పాటు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటానని అన్నారు. అందుకే విలువిద్య నేర్చుకున్నానని నిత్యం ప్రాక్టీస్‌ చేస్తున్నానని సమంత చెప్పారు.

ఉదయం షూటింగ్‌ ఉన్నా అంతకు ముందే జిమ్కు వెళ్లతానన్నారు. ఆకలితో ఉండడం, ఉపవాసాలు చేయడం లాంటివి తనకు అలవాటు లేదన్నారు. ప్రొటీనులు ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తీసుకుంటానని, ఫ్రెస్‌ జ్యూస్‌, కొబ్బరి నీళ్లు తరచూ తాగుతానని చెప్పారు. పోషకాహారాలే అందాన్ని మిలమిల మెరిసేలా చేస్తాయని సమంత పేర్కొన్నారు.