దోచుకోవడం అంటే బాంబే బేబీలే!!

0Pooja-hegde-and-kiara-advanమనం కొంచెం ఎగబడితే చాలు.. ఈ బాంబే బేబీలు ఉన్నారు చూడండి.. వీరు చక్కగా దోచేసుకుంటారు. ఒక ప్రక్కన హీరోలకు మాత్రం రెండంకెల ఫిగర్ ను కోట్లలో ఇస్తున్నప్పుడు.. మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్ అంటున్నారు. దానికితోడు మన దగ్గర యాక్టింగ్ కంటే కూడా ఆ గ్లామర్ కే డిమాండ్ ఉండటంతో.. ఖచ్చితంగా వీరు అడిగినంత కట్టబెట్టేసి దించేస్తున్నారు.

అప్పట్లోనే మల్లీశ్వరి సినిమా కోసం.. కనీసం ఇక్కడ ముఖం కూడా పరిచయం లేని కత్రినా కైఫ్ కు 75 లక్షలు ఇచ్చారు. ఆ సమయంలో ఆమెకు యాక్టింగ్ అంటే కూడా స్పెల్లింగ్ తెలియని పరిస్థితి. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ కృతి సనోన్ ను రెండు సినిమాల్లో తీసుకున్నారు. ఆమె కూడా దాదాపు కోటి వరకు వసూలు చేసింది. ఇప్పుడు పూజా హెగ్డే ఉంది చూశారూ.. ఇంకా కనీసం ఒక్క హిట్టు కూడా టాలీవుడ్లో కొట్టలేదు కాని.. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి 1.25 కోట్లు తీసుకుందట. ఇచ్చేవాళ్లుంటే ఎందుకు తీసుకోదులే. అయినా కూడా హీరోయిన్ కు డిమాండ్ ఉన్నప్పుడు ఆమె మాత్రం దోచుకోవడం కూడా తప్పులేదులే. అలాగే మహేష్ సరసన నటించే కియారా అద్వానికి కూడా కోటిపైనే పైకం ఇస్తున్నారట. లోఫర్ బ్యూటి దిశా పటాని అయితే ఏకంగా 5 కోట్లు కోట్ చేసింది. అఖిల్ కోసం బాలీవుడ్ భామలను అడిగితే.. వారు కూడా 2-3 కోట్లు అంటున్నారు. అందుకే హీరోయిన్ ఎంపిక లేటవుతోంది.

కాకపోతే ఇదే రేంజ్ ఎంకరేజ్మెంట్ మన తెలుగు పిల్లలకు కూడా ఇస్తే బాగుంటుంది. ఎంతో సెక్సీగా ఉండే తేజస్విని మదివాడ.. యాక్టింగ్ తో ఇరగదీసే కలర్స్ స్వాతి.. బ్యూటి క్వీన్ మధుశాలినీ.. వీళ్ళకు మాత్రం ఇంతేసి పేమెంట్లు ఇవ్వకపోగా.. ఓ నాలుగైదు లకారాలు ఎక్కువ అడిగినందుకే సినిమాల నుండి తీసి పక్కన పెడుతున్న పరిస్థితి నెలకొంది. అది సంగతి.