ఆగష్టు 19 నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించలన్న హైకోర్టు

0

counseling-for-EAMCET-fromఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం చాలారోజులు నుండి విద్యార్థులు వారి తల్లి దండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై రాష్ట్ర హైకోర్టు ఈ రోజు తీర్పును తెలియజేసింది. దీనితో కౌన్సిలింగ్ పై ఉన్న అవరోదలన్ని తొలగిపోయాయి. ఈ కేసులో హైకోర్టు ఈ నెల 19నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంబించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కౌన్సిలింగ్ లో యాజమాన్య కోటాకు సంబందించిన సీట్లను కూడా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని అలాగే ఆ సీట్ల వివరాలను కూడా సంబందిత వెబ్ సైట్ లో పొందుపరచాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ కౌన్సిలింగ్ ప్రారంబించడానికి వారం రోజుల ముందుగానే దానికి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చెయ్యాలని కూడా హైకోర్టు విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనితో ఈ నెల 12న ఎంసెట్ కౌన్సిలింగ్ కు సంబందించిన నోటిఫికేషన్ వేలుబడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎంసెట్ కౌన్సిలింగ్ లలో ఇంత ఆలస్యం ఎప్పుడు జరగలేదని పలువురు తెలియజేశారు.

ఆగష్టు 19 నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించలన్న హైకోర్టు, High Court Green Signal to EAMCET counseling, EAMCET counseling Schedule 2013, EAMCET 2013 counseling, EAMCET counseling Dates, EAMCET counseling online, EAMCET counseling rank wise, EAMCET counseling Schedule, EAMCET counseling dates 2013, EAMCET Engineering Counseling 2013, Engineering Counseling 2013 date, High Court Green Signal to EAMCET counseling
Please Read Disclaimer