బాహుబలి కి తొలి రోజు 100 కోట్లు.. తక్కువేమో

0Baahubali-2-ఇంకో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు.. హైప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ పరంగా.. కలెక్షన్ల పరంగా ‘ది కంక్లూజన్’ భారతీయ సినీ పరిశ్రమలోని అన్ని రికార్డులనూ బద్దలు కొట్టడం గ్యారెంటీ అన్నది అందరి నమ్మకం. ఆ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు.

వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘బాహుబలి-2’ రికార్డు నెలకొల్పడం లాంఛనమే అని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ మార్కును ఈ సినిమా ఎన్ని రోజులకు అందుకుంటుంది.. తొలి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది.. తొలి వీకెండ్లో ఎన్ని వసూళ్లు వస్తాయి అన్నదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా కూడా తొలి రోజు వరల్డ్ వైడ్ వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆ ఘనతను అలవోకగా అందుకుంటుందనే భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజవుతున్న స్కేల్ చూస్తే.. తొలి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు తక్కువేమో అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇండియా వరకే వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ అని.. వరల్డ్ వైడ్ కలెక్షన్లను కలుపుకుంటే రూ.150 కోట్ల మార్కును దాటినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.

ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 8 వేల థియేటర్లలో.. మిగతా దేశాల్లోని స్క్రీన్లన్నీ కూడా కలిపితే 10 వేలకు పైగా థియేటర్లలో సినిమా రిలీజవుతుండటం.. టికెట్ల రేట్లు కూడా ఎక్కువ పెట్టి అమ్మబోతున్న నేపథ్యంలో ట్రేడ్ పండిట్లు అంచనాలు కట్టలేని స్థాయిలో వసూళ్లు ఉంటాయని.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కూడా అనూహ్యంగానే ఉంటాయని భావిస్తున్నారు.