మిసెస్ నాగార్జున కొత్త అవతారం

0

90వ దశకంలో నాగార్జునను పెళ్లి చేసుకోక ముందు టాప్ హీరొయిన్స్ లో ఒకరిగా వెలిగిన అమల అప్పట్లో చిరంజీవి-వెంకటేష్-రజనికాంత్- కమల్ హాసన్ లాంటి ఎందరో అగ్ర హీరోల సరసన బ్లాక్ బస్టర్స్ చేశారు. నాగ్ తో వివాహం జరిగాక పూర్తిగా వైవాహిక జీవితానికి అంకితం అయిపోయిన అమల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.

ఆ మధ్య దుల్కర్ సల్మాన్ హింది సినిమా కార్వాన్ లో మంచి పాత్రలో మెప్పించారు. అంతకు ముందు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చేసిన చిన్న పాత్ర ఏమంత పేరు తీసుకురాలేకపోయింది. ఇవన్ని పరిమిత నిడివి ఉన్న పాత్రలు కాబట్టి కం బ్యాక్ పరంగా పెద్దగా హెల్ప్ కాలేదు. తాజాగా అమల వెబ్ సిరీస్ రూపంలో తనలో యాక్టర్ కి కొత్త ఛాలెంజ్ విసురుతున్నారు

హై ప్రీస్టేస్ పేరుతో జీ 5 రూపొందించిన వెబ్ సిరీస్ ఇవాళ విడుదలైంది. మొత్తం 8 ఎపిసోడ్లతో సరాసరి ఒక్కొక్కటి అరగంట నిడివితో ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ చూడాలంటే మొత్తం 4 గంటల సమయాన్ని వెచ్చించాల్సిందే. పాత్ర పరంగా అమల కొత్తగా ట్రై చేశారు. మొదటిసారిగా దెయ్యాలతో నేరుగా డీల్ చేసే సైకిక్ గా నటించారు. ఆత్మలు దెయ్యాలు చుట్టూ తిరిగే ఈ హై ప్రీస్టేస్ లో అమల రోలే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్-కిషోర్-బ్రహ్మాజీ లాంటి నోటేడ్ ఆర్టిస్టులు ఉండటంతో ప్రొడక్షన్ కూడా రిచ్ గా అనిపిస్తోంది. మాయ- రూబి – వానిటీ- 12 – వెంగనెన్స్ – ఇన్నోసెన్స్ – ఫ్రెండ్స్ – ఇంటు ది లైట్ పేరుతో రూపొందిన ఎపిసోడ్ల కూర్పు ఆసక్తిగా ఉంది. రిలీజయ్యింది ఇవాళే కాబట్టి అమల ఎలా చేసారు ప్రీస్టేస్ భయపెట్టిందా లేదా అని తెలుసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది
Please Read Disclaimer