‘అరవింద’ ఇంటర్వెల్ అరుపులే..

0

తెలుగు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఉన్న ఏకైక భారీ చిత్రం ‘అరవింద సమేత’నే. వేసవితో భారీ సినిమాల సందడికి తెర పడిపోయాక.. ఇన్నాళ్లకు ‘అరవింద సమేత’ రాబోతోంది. ఇంకో ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. నిన్ననే రిలీజైన ట్రైలర్ కూడా కొంతమేర అంచనాలు పెంచింది. కథ విషయంలో అంత కొత్తదనం లేకపోయినా.. కథనం ఆసక్తికరంగా సాగుతుందని.. ఎన్టీఆర్ సినిమాను నిలబెట్టే పెర్ఫామెన్స్ ఇచ్చాడని.. త్రివిక్రమ్ ఎమోషన్లు బాగా పండించాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఐతే ద్వితీయార్ధం చాలా సీరియస్ గా సాగుతుందని.. మామూలుగా ఒక స్టార్ హీరో-స్టార్ డైరెక్టర్ కలిసి చేసే సినిమాలో ప్రేక్షకులు ఆశించేలా ముగింపు ఉండదని సమాచారం. చాలా వయొలెంట్ గా ఉండే హీరోలో మార్పు వచ్చి ఫ్యాక్షనిజానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో శాంతియుతంగా పోరాడతాడని ట్రైలర్ సంకేతాలిచ్చింది. ఇందుకు తగ్గట్లే ముగింపులో భారీ ఫైట్లు లాంటివేమీ ఉండదట. ఎమోషనల్ గా టచ్ చేసేలా ముగింపు సన్నివేశాల్ని త్రివిక్రమ్ తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఐతే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మాస్ కు పూనకాలు తెప్పిస్తుందని.. అదే క్లైమాక్స్ లాగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్లో ఎన్టీఆర్ కత్తి పట్టి చెలరేగిపోయే ఎపిసోడ్ వచ్చేది ఇంటర్వెల్ ముందే వస్తుందట. తారక్ షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చూపించే సీన్ కూడా అప్పుడే వస్తుంది. ఈ సన్నివేశం థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుందంటున్నారు. ముగింపు విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఇలాంటి ఎపిసోడ్లను ఆశించకుండా సినిమాకు వెళ్లడం బెటర్ అంటున్నారు.
Please Read Disclaimer