భార్యకు విడాకులు.. ప్రేయసితో పెళ్లికి ఏర్పాట్లు..

0


sonia-kapoor-himeshబాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది. సంగీత దర్శకుడు, నటుడు హిమేశ్ రష్మియా దంపతులు తమ వైవాహిక బంధానికి రాం రాం చెప్పారు. గత కొద్దికాలంగా వ్యక్తిగత విభేదాల కారణంగా ఒకరికొకరు దూరంగా ఉంటున్న వీరికి బుధవారం కోర్టు విడాకులు మంజూరు చేసింది. హిమేష్ దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియా వస్తున్న వార్తలకు దీంతో తెరపడింది. అయితే హిమేష్ రష్మియా టెలివిజన్ తారతో సంబంధం పెట్టుకొన్నాడనే వార్తలు జోరుగా ప్రచారం కావడం విశేషం.

1995లో హిమేశ్ రష్మియా, కోమల్‌ వివాహం చేసుకొన్నారు. వారికి స్వయం అనే కుమారుడు ఉన్నాడు. వారిద్దరి కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో హిమేశ్, కోమల్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దాంతో వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. కుమారుడి సంరక్షణ బాధ్యతలను ఇద్దరు చూసుకోవాలని ముంబైలోని బంద్రా ఫ్యామిలీ కోర్టు సూచించింది.

22 ఏళ్ల వివాహం బంధం అర్థాంతరంగా ముగిసిపోవడానికి హిమేశ్ రష్మీయాకు మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని బలంగా వినిపిస్తున్నది. టీవీ నటి సోనియా కపూర్‌తో హిమేశ్ రిలేషన్ పెట్టుకొన్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. అప్పటి నుంచే వారి మధ్యలో కలతలు ప్రారంభమయ్యాయని, ఆ కారణంగానే వారు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం.

కోర్టు విడాకులు మంజూరు చేసిన అనంతరం హిమేష్, కోమల్ మీడియాతో మాట్లాడారు. హిమేశ్ మీడియాతో మట్లాడుతూ.. కొన్నిసార్లు వైవాహిక, వ్యక్తిగత బంధంలో ఒకరికొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. మా మధ్య ఉన్న రిలేషన్‌కు నేను గౌరవిస్తాను. మేమిద్దరం విడిపోవాలని అనుకొన్నాం. మేము తీసుకొన్న నిర్ణయం మాలో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. మా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఆమోదించారు. విడాకులు తీసుకొన్న తర్వాత కూడా కోమల్ మా కుటుంబంలో ఆమె ఒకరని, అలాగే ఆమె కుటుంబంలో తాను ఒకడినని అన్నారు.

హిమేశ్ అంటే నాకు పూర్తిగా గౌరవం ఉంది. మేము ఇద్దరం విడిపోవాలని అనుకొన్నాం. మా మధ్య ఎలాంటి ద్వేషభావాలు లేవు. ఒకరంటే ఒకరికి పరస్పర గౌరవం ఉంది. వ్యక్తిగతంగా మా మధ్య మంచి సంబంధాలు కొనసాగుతాయి అని కోమల్ అన్నారు.

మేము విడిపోవడానికి కారణం సోనియా కపూర్ కానేకాదు అని హిమేశ్ రష్మియా అన్నారు. సోనియా వ్యవహారాన్ని ఈ విషయంలో దూర్చవద్దు. మా మధ్య సరైన అవగాహన కుదరకపోవడం వల్లే మేము విడిపోతున్నాం. అంతకు మించి ఏమీ లేదు. సోనియా మా కుటుంబంలో సభ్యురాలు లాంటింది అని హిమేశ్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా సోనియా కపూర్‌ను వివాహం చేసుకొనేందుకు హిమేశ్ ఏర్పాట్లు చేసుకొంటున్నారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.