బిగ్ బాస్ లేడి మారేలా లేదు

0హీనా ఖాన్ అంటే నార్త్ జనాలకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మడు ఈ ఏడాది మొదట్లో బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2017-18 సీజన్ లో మంచి పాపులార్టీ అందుకున్న బిగ్ బాస్ లేడీగా అమ్మడు నిలిచింది. బుల్లితెరపై సీరియల్స్ లో 8 ఏళ్ళు కష్టపడినా అందని క్రేజ్ ఆ రియాలిటీ షోతో అందుకుంది.

అయితే గత కొంత కాలంగా ఈ లేడి కనిపించలేదేంటి అనుకుంటున్నా సమయంలో సడన్ దర్శనం ఇచ్చింది. అదికూడా ఎవరు ఊహించని విధంగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ గాలి వల్లే ఏమో గాని కాంట్రవర్షియల్ సృష్టించడం అమ్మడికి కొత్తేమి కాదు. ఒక బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించి బెల్లి డ్యాన్స్ చేసింది. అది చూసిన వారంతా ఇప్పుడు అమ్మడిపై మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అసలే రంజాన్ పవిత్ర మాసం సమయంలో హీనా ఖాన్ ఇలా చేయడం ఏం బాలేదని కామెంట్ చేస్తున్నారు.

గతంలో రెండు మూడు సార్లు ఇలాంటి కాంట్రావర్హియల్ న్యూస్ లు సృష్టించినప్పుడే అమ్మడిపై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా మారకుండా మళ్లీ అదే తరహాలో చేయడం వివాదాస్పదంగా మారింది. కాలిగా ఉండడంతో హీనా కు ఎలాంటి ఛాన్సులు రాక మళ్లీ వైరల్ అవ్వాలని ఇలా చేస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే అమ్మడును సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ పక్కన నటించమన్నారని.. కాని పాటల్లో నడుం చూపించాల్సి వస్తుందని తనే ఆ సినిమాను వద్దనుకున్నానంటూ బిగ్ బాస్ టైములో కామెంట్ చేసింది. ఇప్పుడు ఆమె పెడుతున్న ఫోటోలు చూస్తుంటే.. ఆమెకు తెలుగులో ఐటం సాంగు ఛాన్సులు తప్పించి అసలు హీరోయిన్ వేషాలు వస్తాయా?