కొత్త వివాదంలో శాతకర్ణి!

0Gautamiputra-Satakarni-controvesyనందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా దర్శకుడు క్రిష్ భారతదేశ పౌరుషానికి చిహ్నమైన చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవితాన్ని, గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు, భావి తరాలకు తెలిసేలా చేశారని అనేకమంది సినీ, ఇతర రంగాల ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకి పన్ను మినహాయింపును ఇచ్చి గౌరవించింది. కానీ ప్రస్తుతం ఈ చిత్రంపై కొత్త వివాదం రాజుకుంటోంది. ప్రముఖ చరిత్రకారుడు, రాయల్ హిస్టారికల్ సొసైటీ లండన్ సభ్యుడు, వాయిస్ ఆఫ్ తెలంగాణ నాయకుడు కెప్టెన్ ఎల్. పాండురంగా రెడ్డి ఈ చిత్రంలో ఫ్లూ తప్పులున్నాయని, చరిత్రను తప్పుదారి పట్టించారని, ఈ చిత్రానికిచ్చిన పన్ను రాయితీని వెనక్కు తీసుకోవాలని డిమాం చేస్తున్నారు.

శాతకర్ణి కోటిలింగాల్లో పుట్టలేదని, అయన తల్లి గౌతమి బాలశ్రీ ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయని అన్నారు. అంతేగాక శాతకర్ణి కుమారుడు పులోమావి విధి లేని పరిస్థితుల్లో అమరావతికి వచ్చాడని, పైగా సినిమాలో చూపినట్టు శాతకర్ణి కాలంలో గుర్రపు జీనులు వాడే సాంప్రదాయం వాస్తవంగా లేదని, ఇలాంటి తప్పుల వలన చరిత్ర వక్రీకరించబడిందని, దీనిపై దర్శకుడు క్రిష్ వివరణ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం పై పలు టీవీ ఛానళ్లలో చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి వీటిపై శాతకర్ణి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.