టాలీవుడ్ కోలీవుడ్ అంటే ఫైట్ చేస్తా!

0విశ్వనటుడు గా అందరిచేత పిలిపించుకునే కమల్ హాసన్ తాజా చిత్రం ‘విశ్వరూపం-2’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కమల్ ప్రమోషనల్ ఇంటర్వూస్ తో బిజీగా గడుపుతున్నాడు. అలా ఒక ఇంటర్వ్యూ లో హాలీవుడ్ – కొలీవుడ్ – టాలీవుడ్ పదాలు వినగానే కమల్ కు చిర్రెత్తుకొచ్చింది. అసలు హాలీవుడ్ అనేది ఒక ఊరి పేరని – అసలు అమెరికాలో ఫిలిం ఇండస్ట్రీ మొదట న్యూయార్క్ లో ఉండేదని క్లాస్ పీకాడు.

యాంకర్ మొదట కమల్ ను ఇలా ప్రశ్నించింది. “ఎప్పుడైనా ఇలాంటి సినిమా గురించి మాట్లాడినప్పుడు హాలీవుడ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి… బాలీవుడ్ – కోలీవుడ్ – టాలీవుడ్ లోరావు. యాక్షన్ విత్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లోనే తెరకెక్కుతాయి అంటారు. అసలు ఈ విశ్వరూపం ఐడియా మీకు ఎలా వచ్చింది?

దీనికి కమల్ సమాధానం అయన మాటల్లోనే ” విశ్వరూపం కోడంబాకం(మన ఫిలిం నగర్ లా చెన్నై లో ఏరియా) లో తయారయింది. విశ్వరూపం జేమ్స్ బాండ్ కాదు. కోడంబాకం కోలీవుడ్ కాదు. అసలు టాలీవుడ్ – కోలీవుడ్ బాలీవుడ్ అనేవే లేవు. నా ఫిలిం ఇండస్ట్రీ ని ఇలాంటి అరువుతెచ్చుకున్న పేర్లతో పిలవడం నేను అగౌరవంగా భావిస్తాను. అసలు హాలీవుడ్ అనే పేరే ఉండాల్సింది కాదు. దాని పేరు న్యూ యార్క్ ఫిలిం ఇండస్ట్రీ అని ఉండాలి కానీ అక్కడ లోకల్ మాఫియా వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. లేకపోతే దాని పేరు ఇప్పటికీ న్యూ యార్క్ ఫిలిం ఇండస్ట్రీ అని ఉండేది. హాలీవుడ్ అనేది ఓక ఊరి పేరు అందులో బ్రాండ్ వేల్యూ కూడా లేదండీ. మనం అనవసరంగా అది క్రియేట్ చేస్తున్నాం. మనం దాన్నో అద్భుతంలా చూస్తున్నాం. గొప్ప టాలెంట్ ఉన్నప్పుడు అటు చూడడం తప్పులేదు కానీ నాముందు ఎవరైనా కోలీవుడ్ టాలీవుడ్ అంటే నేను మాత్రం వాళ్లతో ఫైట్ చేస్తా! ఇది ఆల్రెడీ తెలంగాణా సినిమా.. ఆంధ్రా సినిమా.. వైజాగ్ సినిమా.. తెలుగు సినిమా.. అవసరమైతే హైదరాబాద్ సినిమా అనండి!”

కాసేపు ఆగితే ఇంకా ఎంత పెద్ద క్లాస్ పీకుతాడో అని భయపడి యాంకర్ కూడా అవును సర్ ఇది ఇండియన్ సినిమా అని ఒప్పుకుంది. కమల్ చెప్పేదంతా నిజమేగానీ.. ఆ అరువు తెచ్చుకున్న పదాలే అందరికీ అలవాటయ్యాయి. ఇప్పుడు ఈ విశ్వనటుడేమో ఎవరైనా అవి అయన ముందు వాడితే విశ్వరూపం చూపిస్తా అంటున్నాడు. తస్మాత్ జాగ్రత్త యంకర్లూ.. ఇంటర్వ్యూయర్లూ .. ఆయనతో రొంబ కష్టం.. తర్వాత మీ ఇష్టం!