అనుష్క తెలుగు ఎలా నేర్చుకుంది?

0anushka-teluguగత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందాల భామ అనుష్క చుట్టూ తిరుగుతోందనే చెప్పాలి. ఈ భామ స్వతహాగా తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు మాట్లాడుతూ అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. తులు మాతృ భాష అయిన అమ్మాయి అంత సులువుగా తెలుగు ఎలా నేర్చుకుంది?

ఈ విషయాన్ని అనుష్క తెలియజేస్తూ ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, నాకు చాలా విభాగాల గురించి తెలియదు. అలాగే నాకు యాక్టింగ్ గురించి కూడా తెలియదు. అందుకే ఇండస్ట్రీలో ఉండాలి అంటే నటన రాకపోయినా ప్రస్తుతాని మనకు భాష అన్నా అర్ధం కావాలి. అందుకు తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టా. దానికోసం రోజూ తెలుగు టీవీ చానల్స్ చూసే దాన్ని. దాంతో తెలుగు ఈజీగా నేర్చుకోగలిగాను. చెప్పాలంటే లోకల్ టీవీ చానల్స్ ద్వారానే భాష ఈజీగా నేర్చుకోవచ్చనేది నా అభిప్రాయమని’ అనుష్క తెలిపింది.

ప్రస్తుతం అనుష్క ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది.