జగన్ వద్దకు పీకే: బిజెపి నేత సూచనతోనా?

0Jagan-and-prashant-kishorవైసిపి అధినేత జగన్ వద్దకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చింది ఓ బిజెపి కీలక నేత సూచనతోనా? బిజెపి – వైసిపిలు దగ్గరయ్యే అవకాశాలు అక్కడి నుంచి మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నారు.

ఎంపీ విజయ సాయి రెడ్డికి కేంద్రంలో ఓ మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. సదరు నేతనే విజయ సాయికి ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేశారని చెబుతున్నారు. అంతేకాదు, ప్రశాంత్‌కు, ప్రధాని మోడీకి 2014 ఎన్నికలకు ముందు కలిపింది కూడా సదరు నేతనే అని ప్రచారం సాగుతోంది.

ప్రశాంత్ కిషోర్‌ను విజయ సాయికి ప్రచారం చేయడం.. వెంటనే జగన్ పోరుకు తోడు, వ్యూహకర్త ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డ సాయి.. ఆయనను అధినేతకు పరిచయం చేశారని అంటున్నారు.

తన పోరాటానికి ప్రశాంత్ వ్యూహాలు కలిస్తే 2019లో విజయం సాధించవచ్చునని జగన్ భావించి ఆయనను ఓకే చేశారని అంటున్నారు. కేవలం పోరాటాలే సరిపోవని, పైగా ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ సర్వేలు, వ్యూహాలు తమకు కలిసి వస్తాయని జగన్ భావించారంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఆయన నుంచి మంచి రిపోర్టులు తెప్పించుకొని అందుకు అనుగుణంగా ముందుకు నడువవచ్చునని భావించారని అంటున్నారు.

ఓ బిజెపి నేత.. ప్రశాంత్ కిషోర్‌ను వైసిపికి పరిచయం చేయడం, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వెంకయ్యను ఉప రాష్ట్రపతిగా చేయాలని నిర్ణయించడం వంటి పరిణామాలు చూస్తుంటే ఏపీలో చంద్రబాబుకు షాకిస్తూ.. జగన్‌కు దగ్గరయ్యే సూచనలే కనిపిస్తున్నాయని అంటున్నారు.