హృతిక్ షాకింగ్ న్యూ మేకోవర్

0

నిరంతరం జిమ్ముల్లో కుస్తీలు పడుతూ దేహదారుడ్యాన్ని ది బెస్ట్ గా టోనప్ చేసే హీరోల జాబితా తిరగేస్తే ఆ లిస్ట్ లో నంబర్ -1 స్థానం హృతిక్ రోషన్ దే. ఆ తర్వాతే ఏ హీరో పేరు అయినా జాబితాకెక్కాలి. రోజుకు 4 గం.లు స్ట్రిక్ట్ గా జిమ్ చేసే హీరోగా అతడు బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఇండస్ట్రీ బెస్ట్ కండల హీరోలు ఎందరు ఉన్నా.. హృతిక్ లుక్ .. ఆ ఫిట్ బాడీ వేరొకరికి కుదరలేదు. అందుకే అతడంటే మగువల్లో విపరీతమైన క్రేజు. ప్రతి సారీ హృతిక్ తాను ఎంచుకున్న స్క్రిప్టుకు తగ్గట్టే బాడీలో మేకోవర్ చూపిస్తుంటాడు. ఈసారి కూడా అతడు మరోసారి లుక్ ఛేంజ్ కోసం ట్రై చేశాడని తాజా ఫోటో ఒకటి చెబుతోంది.

`కహోనా ప్యార్ హై` సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హృతిక్ `క్రిష్` ఫ్రాంఛైజీ హీరోగా అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో హృతిక్ లుక్ కి యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించి పెట్టింది అతడి లుక్కే. అటుపై క్రిష్ ఫ్రాంఛైజీ సినిమాల్లో హృతిక్ లుక్ మరో లెవల్లో కనిపించింది. ఇక ఇటీవలే `కాబిల్` లో పాత్రకు తగ్గట్టు కనిపించాడు. గుజారిస్ లో కుర్చీకి అంకితమయ్యే అరుదైన వ్యాధిగ్రస్తుడిగా అద్భుతంగా జీవించిన హృతిక్ కాబిల్ లో అంధుడిగా మైమరిపించే పెర్ఫామెన్స్ తో కట్టిపడేశాడు. ప్రస్తుతం గణిత శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ బయోపిక్ `సూపర్ 30`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒక పేదవాడైన మేధావి తనలాంటి మేధావుల్ని తీర్చిదిద్దిన గొప్ప జీవిత గమనానికి సంబంధించిన సినిమా ఇది. ఈ సినిమాకి వికాశ్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వేరొక సినిమా సెట్స్ పై ఉంది. వీటితో పాటే డాడ్ రాకేష్ రోషన్ దర్శకత్వంలో `క్రిష్ 4`లో నటించేందుకు ప్రిపరేషన్స్ సాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా హృతిక్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేశారు. ఈ ఫోటోలో హృతిక్ టోన్డ్ బాడీ సరికొత్త మేకోవర్ తో సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. మునుపటితో పోలిస్తే హృతిక్ మజిల్స్.. బాడీ షేపప్ అయిన తీరు .. బైసెప్ .. ట్రైసెప్ లుక్ పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తోంది. పక్కా టోన్డ్ బాడీతో హృతిక్ లో ఎనర్జీ డబుల్ అయినట్టే కనిపిస్తోంది. ఇది తదుపరి నటించే సినిమా కోసమేనా? అంటూ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. టైగర్ ష్రాఫ్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయింది కాబట్టి ఈ న్యూ లుక్.. క్రిష్ 4 కోసమేనని భావించవచ్చు. ఈ ఫోటోతో పాటు హెచ్.ఆర్.ఎక్స్ వల్లనే ఈ దేహదారుడ్యం సాధ్యమైంది! అంటూ హృతిక్ ప్రత్యేకంగా మెన్సన్ చేయడం ఆసక్తికరం.
Please Read Disclaimer