గొడుగుని అడ్డం పెట్టుకున్న హృతిక్..ఎందుకు?

0హృతిక్ రోషన్ కు బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని పేరు. టాప్ లీగ్ స్టార్స్ లో ఒకడైన హృతిక్ స్టైలిష్ గా ఉండే రోల్స్ తో పాటు అప్పుడప్పుడూ డీ-గ్లామరైజ్డ్ పాత్రలు కుడా చేస్తుంటాడు. మరీ ‘శివపుత్రుడు’ విక్రమ్ టైపులో కాదు గానీ ఒక లిమిట్ వరకూ ప్రయోగాలు చేస్తాడు. హృతిక్ ప్రస్తుతం ‘సూపర్ 30’ నే ఒక బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక సాధారణ టీచర్ గెటప్పులో గా కనిపిస్తాడు. రీసెంట్ గా ఆ సినిమా సెట్స్ నుండి ఒక పిక్ బయటకు వచ్చింది. అదిప్పుడు వైరల్ కూడా అయ్యింది.

ఇంతకీ ఆ ఫోటోలో హృతిక్ ఏం చేస్తున్నాడంటే ఓ గొడుగుని తన మొహానికి అడ్డంగా పెట్టుకుని నడుస్తున్నాడు. హృతిక్ అసలే హ్యాండ్సమ్ హంక్ కదా మరి ఎందుకు అలా ఫేస్ ని కవర్ చేసుకున్నాడు? ఏం లేదు.. ఇప్పటికే ‘సూపర్ 30’ సినిమా లొకేషన్ నుండి కొన్ని పిక్స్ లీకయ్యాయి. అందులో ఆల్రెడీ హృతిక్ గెటప్ కూడా బయటకు వచ్చింది. దీంతో ఫిలిం మేకర్స్ అధికారికంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేవరకూ అలా జరగకుండా హృతిక్ తన మొహాన్ని గొడుగుతో కవర్ చేసుకుంటున్నాడట. ఎంటో.. గ్రీకు గాడ్ కి కూడా ఇలాంటి కష్టాలు!

ఈ సినిమా పాట్నా బేస్డ్ మ్యాథమేటిషియన్ – విద్యావేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ద్వారా ఎకనామిక్ గా వీక్ గా ఉండే పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఐఐటీ లో ప్రవేశం లభించేలా చేయడం ద్వారా అయన దేశం దృష్టి ని ఆకర్షించాడు. అంతే కాకుండా ఆనంద్ కుమార్ గణిత శాస్తంలో చేసిన రీసెర్చ్ పేపర్స్ ప్రఖ్యాత అంతర్జాతీయ గణిత మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఈ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సూపర్ 30’ జనవరి 25 – 2019 న ప్రేక్షకుల ముందుకు రానుంది.