అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న మహేష్!

0Mahesh-Babu-in-Assemblyమహేశ్ బాబు కొత్త సినిమా మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న స్పైడర్ షూటింగ్ పూర్తి కావొస్తోంది. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా జరుగుతున్నా మహేశ్ తో షూటింగ్ పని పూర్తి చేశారు. దీనితో మహేశ్ తన తదుపరి చిత్రం కొరటాల శివ ‘భరత్ అను నేను’ సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. ఇకపోతే మహేశ్ ఈ సినిమా కోసం కొత్త లుక్ తో కనపడనున్న సంగతి తెలిసిందే. పాత్ర కోసం పూర్తిగా మారి యువ రాజీకీయ నేత గా మారిపోనున్నాడు.

భరత్ అను నేను సినిమా కోసం కొరటాల శివ పక్క ప్లాన్ తో ఉన్నాడులే. జూన్ రెండో వారంలో మహేశ్ తో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్య మంత్రిగా కనిపిస్తాడు. అందు కోసం అతని ప్రమాణ స్వీకారసభ కోసం కొన్ని కీలక సన్నివేశాలు కోసం హైదరాబాద్ శివారులలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. మామూలు సెట్ కాదు.. ఏకంగా మనోళ్లు అసెంబ్లి నే నిర్మిస్తున్నారు. భారీ జన సమూహంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండవలిసిన ఫాలోయింగ్ ని తలపించేలా అక్కడ సీన్స్ చిత్రీకరణ జరగబోతోందట. సినిమాకు అసెంబ్లి సన్నివేశాలు కీలకం కాబట్టి వాటి కోసం గ్రాండ్ లుక్ లో భారీ ఎత్తున నిర్మాణం జరుగుతుంది.

ఇంతకు ముందు మహేశ్ సినిమా ఒక్కడు కోసం ఛార్మినార్ కట్టారు. అర్జున్ కోసం మీనాక్షి టెంపుల్ కట్టారు ఇప్పుడు అసెంబ్లి కడుతున్నారు. ఇంతటి కట్టుదిట్టంగా నిర్మించబోతున్న సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకోబోతుందో వేచిచూద్దాం.