ఇంత క్రేజ్ ఏంట్రా బాబు

0

రేపు విడుదల కానున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ క్రేజ్ చూసి తలలు పండిన ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సూపర్ హీరోస్ సినిమాలకు హైప్ ఉండటం సహజమే కాని మరీ ఈ రేంజ్ లో ఒక హాలీవుడ్ మూవీ టికెట్ల కోసం జనం ఈ స్థాయిలో ఎగబడటం మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా ప్రసాద్ ఐమ్యాక్స్ దగ్గర కిలోమీటరుకు పైగా బారులు తీరిన క్యులో యువకులు ఉద్యోగులే కాక మధ్య వయసు మహిళలు కూడా ఉండటాన్ని చెప్పుకోవచ్చు.

ఈ జాతర నిన్నటి నుంచే కొనసాగుతోంది. అయితే ఇదంతా మొదటి ఆట కోసం అనుకునేరు. వరసగా మూడు రోజుల్లో ఏ షోకు దొరికితే ఆ షో చూసేందుకు రెడీ అయిపోయి మరీ నిలబడుతున్నారు. ఎండ్ గేమ్ కాబట్టి అవెంజర్స్ సిరీస్ లో ఇదే ఆఖరి సినిమా. ఇది కూడా ఈ హంగామాకు ఓ కారణంగా చెప్పొచ్చు. ట్రెండ్ చూస్తుంటే ఇండియన్ స్టార్ హీరోల ఓపెనింగ్స్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో రేపు రికార్డులు నమోదు కాబోతున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే విదేశాల్లో పూర్తైన ప్రీమియర్ షోల నుంచి అల్టిమేట్ అనే మాట తప్ప ఇంకొకటి వినిపించడం లేదు. ఇదే టాక్ ఇక్కడా వస్తే దీనికి పట్టపగ్గాలు ఉండవు. ఇన్ఫినిటీ వార్ ను పెద్ద మార్జిన్ తో కొట్టడం ఖాయమే. తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో సైతం ఉదయం 8కే షోలు మొదలుపెడుతున్నారు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రేపు ఈ టైంకంతా రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది. అది ఎలా ఉన్నా దాని ప్రభావం కలెక్షన్స్ మీద పడేలా లేదు. సూపర్ హీరోసా మజాకా అంటున్నారు ఫాన్స్.
Please Read Disclaimer