ప్రభాస్ కోసం ఇండియాలో యూరప్

0బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ కు తెలుగులోనే కాదు.. భారత దేశం మొత్తంమీద అభిమానులు ఉన్నారు. మొత్తం మీద ప్రభాస్ మార్కెట్ బాగా పెరగడం నిర్మాతలకు అనుకోని వరంగా మారింది. అందుకే పెట్టుబడి ఎక్కువైన ఫర్వాలేదని ధైర్యంగా ముందుకెళ్తున్నారు.

బాహుబలి తరవాత ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీని తరవాత జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కథ యూరప్ బేస్ గా ఉంటుంది. కథానుసారం హెలికాప్టర్.. ట్రైన్.. షిప్ లలో చాలా సీన్లు తీయాల్సి ఉంటుంది. ఈ మూడింటినీ వాడుకుని కొన్ని సీన్లు అయితే ఫర్వాలేదు కానీ కంటిన్యూగా సినిమా తీయాలంటే చాలా కష్టం. అందుకోసమే ఈ మూడింటితో భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది.

యూరప్ లో ఉండే ట్రయిన్ – షిప్ – హెలికాప్టర్లు ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉండేలా ఇండియాలోనే పెద్ద సెట్లు వేసి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంత పెద్ద సెట్లనే సరికి ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. అయినా ప్రభాస్ కున్న మార్కెట్ తో ఈ ఖర్చు రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదన్నది నిర్మాతల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. మగధీర సినిమాలో సెట్లతో మెస్మరైజ్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్లు వేయబోతున్నాడు. సెట్లు ఎలా ఉండాలో డిసైడయ్యేందుకు ఇప్పటికే రవీందర్ యూరప్ కు బయలుదేరి వెళ్లాడు.