సింగం 3 మొదటి రోజు భారీ వసూళ్లు!

0Singam-3-still-with-Horseతమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం 3’ చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత పలు సందేహాల నడుమ ఎట్టకేలకు ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా భారీ అంచనాలుండటం, సూర్య క్రేజ్, భారీ స్థాయి విడుదలతో ఈ చిత్రం బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఒక తమిళనాట మాత్రమేగాక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి. నిన్న ఉదయం తెలుగు రాష్ట్రాల్లో మొదటి షోలు రద్దైన 11 గంటల ప్రాంతంలో మొదలైనప్పటికీ మంచి వసూళ్లు తెచ్చుకుంది.

ఇకపోతే గల్ఫ్ ప్రాంతంలో సూపర్ స్టార్ రజనీ ‘కబాలి’ తర్వాత అంతటి స్థాయిలో రిలీజ్ పొందిన చిత్రం సూర్య ‘సింగం 3’ కావడం విశేషం. ఇకపోతే కేరళలో 218, బెంగుళూరులో 317 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26 దేశాల్లో 463 లొకేషన్లలో సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ భారీ రిలీజ్ తో ఈ చిత్ర కలెక్షన్లు ఊహించిన్నదానికంటే ఎక్కువగానే ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.