చరణ్ తారక్ తర్వాత మహేష్!

0

ఈ ఏడాది మన స్టార్ హీరోలకు పల్లెటూళ్ళు బాగా కలిసి వస్తున్నట్టు ఉన్నాయి. రంగస్థలం మొత్తం గోదావరి ప్రాంతంలోని చిన్న ఊళ్ళో తీసిన తీరు అందరిని మెప్పించి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొట్టేసింది. అందులో ఉన్నదంతా సెట్టింగ్ అని నమ్మడానికి కొందరు ఇష్టపడలేదు కూడా. అంత సహజంగా వచ్చింది. ఇక 11న విడుదల కానున్న జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ కథలో కీలక భాగం సీమ గ్రామంలో చూపించబోతున్నారు. అది కూడా రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో తీసిందే. ట్రైలర్ లో చూపించిన పల్లెటూరి విజువల్స్ చాలా సహజంగా అనిపించాయి.

ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షిలో కూడా ముఖ్యమైన విలేజ్ ఎపిసోడ్ ఒకటి ఉందట. దాని కోసమే రామోజీ ఫిలిం సిటీలోనే ప్రత్యేకంగా సెట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకుని టీమ్ ఇక్కడికి వచ్చే లోపు అది సిద్ధంగా ఉంటుంది. ఇందులో హీరో పాత్ర అమెరికా నుంచి ఓ పల్లెటూరికి ఎందుకు రావాలి వచ్చింది అనేది సస్పెన్స్. కాకపోతే అల్లరి నరేష్ వల్లే మహేష్ అక్కడికి వచ్చేందుకు బలమైన కారణంగా చూపిస్తారంట. అది ఏమిటో ఎందుకో వేచి చూడాల్సిందే.

ఏప్రిల్ 5 విడుదల టార్గెట్ చేసుకున్న మహర్షి దానికి తగ్గట్టే షూటింగ్ జరుపుకుంటున్నాడు. వీసాలు రావడం ఆలస్యం కావడంతో అమెరికా వెళ్లడం ఆలస్యమైనా బాలన్స్ చేసుకునే విధంగా వంశీ పైడిపల్లి టీమ్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న మహర్షిలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ సరసన ఎవరైనా ఉంటారా అనే లీక్ ఇంకా బయటికి రాలేదు. అమెరికాతో పాటు రామోజీ ఫిలిం సిటీలో చేసే షూటింగ్ తో ముప్పాతిక శాతం పూర్తవుతుందని ఇన్ సైడ్ టాక్. మార్చ్ లోగా ఫస్ట్ కాపీ రెడీ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్న మహర్షి యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం పట్టుదలతో ఉంది. మరో వైపు మహేష్ ఫ్యాన్స్ కొద్దిరోజుల క్రితమే 200 డేస్ కౌంట్ డౌన్ అంటూ హంగామా మొదలుపెట్టేసారు. ఎదురు చూపులు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి.
Please Read Disclaimer