కోమాలోకి పంపిస్తున్న హుమా

0నేటితరం నటులు చేసింది చిన్న పాత్ర అయినా పది తారలు మారినా గుర్తుండిపోవలని అనుకుంటున్నారు. హీరో హీరోయిన్స్ తో పాటు ఈ రోజుల్లో సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసేవారు ఎక్కువ అభిమానులను ఆకర్షిస్తున్నారు. అటువంటి లేడి నటుల్లో ఇపుడు “హుమా సలీమ్ ఖురేషి” తెగ పాపులర్ అవుతోంది. బద్లాపుర్ సినిమాలో విలన్ ప్రేయసిగా హీరో చేతిలో రేప్ కు గురయ్యే ఒక వ్యభిచారిణిగా నటించి మెప్పించింది.

సినిమా అనే కాకుండా రియాలిటీ షోల్లో మరియు టివి సిరీస్ లలో తన టాలెంట్ ను చూపించుకుంటోంది. అయితే ఇన్ని రోజులు డీసెంట్ గా కనిపించిన ఈ భామ తన హాట్ ఫొటోస్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు ఫిలింఫేర్ కోసం ఇచ్చిన ఫోటో షూట్స్ ఇంటర్నెట్ లో చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కనిపించి కనిపించని అందాలతో హుమా చేస్తున్న హంగామా అంత ఇంతా కాదు. బహుశా.. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకుంటుందో ఏమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా తన అందాలతో కుర్రాళ్లను కోమాలో పంపిస్తోంది హుమా.

ఇకపోతే ఈ అమ్మడు ఇంగ్లీష్ ఫిలింస్ లో కూడా నటిస్తోంది. బాలీవుడ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఈమెని సెలెక్ట్ చేసుకుంటుంటే.. ఆమె తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ -కాల సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ అమ్మడు ఇలానే స్పెషల్ క్యారెక్టర్స్ తో అలరిస్తుందా లేకుంటే బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీని ఇస్తుందా చూడాలి.Huma-Qureshi-poses-for-Filmfare