పిచ్చెక్కించిన బొద్దుగుమ్మ

0బాలీవుడ్ లో హీరోయిన్స్ తప్ప ఇతర సైడ్ క్యారెక్టర్స్ చేసే అమ్మాయిలకు పెద్దగా క్రేజ్ రాదు అనే ఒక టాక్ బాగా ఉంది. హీరోయిన్స్ అందాలతో తెరపై గ్లామర్ షోని బాగా తగిలించడంతో మరో ముద్దుగుమ్మలు తెలిపోతున్నారు. వారి గురించి ఎక్కడా కూడా న్యూస్ లు కూడా సరిగ్గా రావు. అయితే హ్యూమ ఖురేషి మాత్రం అందుకు భిన్నంగా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఈ బ్యూటీ దాదాపు 6 ఏళ్ల నుంచి బాలీవుడ్ లో కొనసాగుతోంది.

ఆఫర్స్ వస్తున్నాయ్ కదా అని ప్రతి ఒక్కటి ఒకే చేయలేదు. పాత్ర చిన్నదైనా సరే చేసుకుంటూ వెళ్లింది. హీరోయిన్ గా కూడా ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా స్పెషల్ రోల్ సినిమాలో అవసరం పడింది అంటే హ్యూమా తలుపు తట్టాల్సిందే. యాక్టింగ్ లో కూడా అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ బి టౌన్ పిల్ల గ్లామర్ విషయంలో కొంచెం బెట్టు చేస్తుంటుంది అని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్ గా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజ్ పై పడిన ఒక ఫోటో చూస్తే హాట్ బ్యూటీ అనకుండా ఉండలేరు.

మరీ వల్గర్ గా కాకుండా తన స్టైల్ లో అమ్మడు డ్రెస్ లోనే అందాన్ని ప్రజెంట్ చేసింది. జనాలు సోషల్ మిడియలో టెర్రిఫిక్ క్లివేజ్ షో అని కామెంట్ చేస్తున్నారు. పిచ్చెక్కించిన బొద్దుగుమ్మ అంటూ వారు మెలికలు తిరిగిపోతున్నారు. ఆమె స్మైల్ కూడా కవర్ పేజ్ కి అందాన్ని తెచ్చిందని చెప్పాలి. ఇటీవల హ్యూమ సౌత్ లో కాలా అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అమ్మడికి అనుకున్నంత రేంజ్ లో హిట్ ఇవ్వలేదు.