హైద్రాబాద్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

0gang-rapeఓ మహిళా కూలీపై సామూహిక అత్యాచారం చోటుచేసుకొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది. గండి మైసమ్మ కూడలిలో నివసించే ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.

భర్త మరణించడంతో మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఈ నెల 13వ, తేదిన షాపూర్‌నగర్‌ అడ్డాలో కూలీ పనుల కోసం వేచి ఉండగా ఆమెను నలుగురు యువకులు ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహికఅత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల నుండి తప్పించుకొన్న బాధితురాలు రాత్రి పూట 8 గంటల సమయంలో షాపూర్‌నగర్‌కు చేరుకొంది. ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు నిందితులు.

దీంతో ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. మంగళవారం నాడు బాధితురాలు ధైర్యం తెచ్చుకొని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోడా మిస్త్రీనగర్‌కు చెందిన లడ్డూ, ఇషాక్‌తో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.