పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్

0Telanganaకాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 వ రాష్ర్టంగా ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. హైదరాబాద్ ను మాత్రం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నట్లు కాంగ్రెస్ నేత అజయ మాకెన్ ప్రకటించారు.

రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని చేస్తున్నట్లు అజయ మాకెన్ తెలిపారు. సీమాంధ్ర ప్రాంతం మాత్రం ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించనున్నట్లు మాకెన్ తెలిపారు. నదీ జలాల పంపిణీకి ప్రత్యేక ఫార్ములాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

సీమాంధ్ర పేరు ‘ఆంధ్రప్రదేశ్’
10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామని తేల్చిచెబుతున్న కేంద్రం.. సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్ గానే పిలుస్తామని స్పష్టీకరించింది. ఢిల్లీలో ఏఐసీసీ మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణను చిన్నరాష్ట్రాల డిమాండ్లతో పోల్చేలేమని డిగ్గీ రాజా తెలిపారు.