రూ. 5 లక్షలు వదులుకున్న హైపర్ ఆది..

0హైపర్ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు..అతి తక్కువ టైం లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్న ఆది..జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈయన వేసే పంచ్ డైలాగ్స్ కు జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ షో కు ముందు ఆది ఏంచేసాడో..తన స్వస్థలం ఏంటి..తన తల్లిదండ్రులెవరు అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆది..స్వస్థలం ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రామం. 2012వ సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసాడట. ఆ టైమ్‌లో 5 లక్షలు జీతం వస్తున్నప్పటికీ ఎక్కడో ఎదో అసంతృప్తి వెంటాడేదని, అందుకే టాలెంట్ రుజువు చేసుకోవాలనే ఉద్ధేశంతో ఆ ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి వచ్చానని తెలిపాడు. 2016వ సంవత్సరంలో ‘జబర్దస్త్’ షో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన హైపర్ ఆది, అప్పటినుండి విపరీతమైన ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని వెండి తెర అవకాశాలు కూడా రాబట్టుకుంటున్నాడు. తాజాగా అల్లరి నరేష్ నటించిన మీద మీద అబ్బాయి చిత్రానికి మాటలు కూడా రాసాడు.